పలమనేరు: అదుపు తప్పి కారు బోల్తా

5829చూసినవారు
బుధవారం పలమనేరు బైపాస్ రోడ్డులోని చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన ఒక కుటుంబం తిరువన్నామలై దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా, రోడ్డుపై నిలిచిన వర్షపు నీటి కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.