పెద్దపంజాణిలో శుక్రవారం కన్న కూతురిపై తండ్రే అత్యాచారం చేసిన దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఎస్టి కాలనీకి చెందిన పెద్దబ్బ తన మొదటి భార్య కుమార్తెను చికెన్ తీసుకుని వెళ్తుండగా బలవంతంగా పొదల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అడ్డుకున్న నానమ్మపై దాడి చేశాడు. అనంతరం అత్యాచారం చేసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.