పలమనేరులో నేటి నుండి 15వ రోజు గంగజాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ నాయుడు తెలిపారు. గురువారం ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమ్మవారి అలంకరణ అద్భుతంగా జరిగిందని, దీనికి కారణమైన ఘంటా ఊరు గంగమ్మ గుడి చైర్మన్ డాక్టర్ మురుగన్ కు ధన్యవాదాలు తెలిపారు. నేటి రాత్రి గంగ జాతరకు చాటు కార్యక్రమం ఉంటుందని, పట్టణ ప్రజలు, గంగమ్మ భక్తులు రావాలని కోరారు.