పలమనేరు: శివాలయానికి భారీ ఆదాయం

18చూసినవారు
పలమనేరు శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయానికి చెందిన ఖాళీ స్థలం, మూడు షాపు రూములకు మంగళవారం జరిగిన వేలం పాట ప్రశాంతంగా ముగిసింది. గతంలో రూ. 1.30 లక్షలు పలికిన ఈ స్థలం, షాపులు ఈరోజు జరిగిన వేలంలో రూ. 8.21 లక్షలకు అమ్ముడయ్యాయని డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ వెల్లడించారు. ఇది దేవాలయానికి ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.