వి. కోటలోని సాయిగార్డెన్ సీటీలో ఫ్యూజులు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి జూనియర్ లైన్మెన్ గణేష్ (27) మృతిచెందారు. రాళ్లబూదుగూరుకు చెందిన గణేష్, ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఫ్యూజ్ సరిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.