పలమనేరు: విద్యార్థినికి పాము కాటు

6చూసినవారు
పలమనేరు: విద్యార్థినికి పాము కాటు
గంగవరం మండలంలోని మేలుమాయి గ్రామంలో ఆదివారం ఏడో తరగతి విద్యార్థిని సంజన పాము కాటుకు గురైంది. దుకాణానికి వెళ్లినప్పుడు కాలువపై ఉన్న పాము ఆమె కాలును కరిచింది. భయభ్రాంతులకు గురైన బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వెంటనే ఆమెను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల కథనం ప్రకారం, ప్రస్తుతం బాలిక ఆరోగ్యం మెరుగ్గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్