పలమనేరులోని ముసలిమడుగులో ఉన్న కుంకి ఏనుగుల క్యాంపులోని ఏనుగులకు ఆధార్ తరహా ప్రత్యేక నంబర్లను ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే వీటి రక్త నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం డెహ్రాడూన్ కు పంపించడం జరిగిందన్నారు. రక్త నమూనాల పరీక్షల అనంతరం వాటికి ప్రత్యేక నంబర్లు కేటాయించి ఆరోగ్య పరిస్థితుల వివరాలతో అనుసంధానం చేయనున్నారు.