వీకోటలో సోమవారం జరిగిన విలేకరి హత్య ఘటనపై పలమనేరులో ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ ప్రజలు, విలేకరులు, న్యాయవాదులు పాల్గొన్నారు.