పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, పలమనేరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో, పెద్ద పంజాని మండలం బసాపురం క్రాస్ వద్ద గంజాయి అమ్ముతున్న మస్తాన్ (57), శ్యామలను (30) తహశీల్దార్ హనుమంతు సమక్షంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 2.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.