పలమనేరు నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని స్థానికులు ఆదివారం రాత్రి తెలియజేశారు. 20 రోజుల కిందట ఈ అక్రమ తవ్వకాలపై నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. గంగవరం మండలం కీలపట్ల సమీపంలోని చెరువులో టిప్పర్లతో మట్టిని లేఔట్లకు తరలిస్తూ రాత్రి వేళల్లో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోనూ పలుచోట్ల ఇలాగే మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి.