కలుపల్లి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం

11చూసినవారు
కలుపల్లి క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం
పలమనేరు సమీపంలోని కల్లుపల్లి క్రాస్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్ (30) అనే యువకుడు మృతి చెందాడు. రాయలపేట పంచాయతీ, దాసనపల్లికి చెందిన నవీన్ పలమనేరు నుండి తిరిగి వెళుతుండగా, కల్లుపల్లి చెక్పోస్ట్ వద్ద ఈచర్ వాహనం అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you