పలమనేరు నియోజకవర్గంలోని వీకోటలో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం అనంతరం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, అధిక గాలులు, ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.