పలమనేరు దండపల్లి రోడ్డులో ఉరుసు మహోత్సవం

713చూసినవారు
పలమనేరు దండపల్లి రోడ్డులోని నగల హజరత్ గంజ్ షహిద్ షావలి జలాలుద్దీన్ బాబా దర్గాలో జరిగిన ఉరుసు మహోత్సవంలో గంటాపూర్ గంగమ్మ గుడి చైర్మన్ డాక్టర్ మురుగన్ సోమవారం పాల్గొన్నారు. ఆయనను కమిటీ సభ్యులు సాలువ, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉరుసు మహోత్సవం గొప్పదని, అన్ని కులాల కన్నా మానవత్వమే గొప్ప కులమని అన్నారు. కమిటీ సభ్యులు ఆయన దాతృత్వాన్ని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్