వి కోట: ఘటన స్థలాన్ని సమగ్రంగా పరిశీలించిన ఎస్పీ

4చూసినవారు
వి కోట: ఘటన స్థలాన్ని సమగ్రంగా పరిశీలించిన ఎస్పీ
వి కోట మండలంలో సోమవారం జరిగిన విలేకరి హత్య ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ సమగ్రంగా పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, దర్యాప్తుకు అవసరమైన ఆధారాలను సేకరించారు. దర్యాప్తును వేగవంతం చేసి, అన్ని కోణాల్లో పరిశీలిస్తూ ఈ కేసు కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. మీడియా మిత్రులు సంయమనం పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విలేకరులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్