క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లి నియోజకవర్గానికి నూతనంగా ఎన్నికైన డిఎంకె ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడను మంగళవారం చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జీ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి జెడ్పిటిసి కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ దేవ, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.