వీకోట: అగ్నిప్రమాదంలో రెండు కోట్ల నష్టం

1చూసినవారు
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి. కోట పరిధిలోని పట్రపల్లె సమీపంలో మంగళవారం ఒక ప్లాస్టిక్ వస్తువుల గోడౌన్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ పైపులు, డ్రమ్ములు, ఇతర పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్లకు సమాచారం అందించడంతో, పలమనేరు, కుప్పం నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. అప్పటికే గోడౌన్లో భారీగా నష్టం జరిగింది. ఈ అగ్నిప్రమాదం వల్ల సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేయబడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you