వీకోట: తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య

4005చూసినవారు
వీకోట: తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య
వీకోటలో తల్లిదండ్రులు మందలించడంతో 19 ఏళ్ల శోభ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. పట్రపల్లి గ్రామానికి చెందిన మురుగేష్, శ్యామల దంపతుల కుమార్తె శోభ, సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని వివాహం చేసుకుంటానని ఇంట్లో తరచుగా గొడవపడేది. మంగళవారం ఈ విషయమై తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.