మంగళవారం కుప్పం- పలమనేరు మార్గమధ్యంలోని వీ కోట మండలం కారకుంట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరుకు పూల లోడ్డుతో వెళ్తున్న బొలెరో వాహనం, కర్ణాటకకు చెందిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.