విలేకరుల నిరసనతో దద్దరిల్లిన వీకోట

1360చూసినవారు
వీకోటలో సోమవారం జరిగిన విలేకరి హత్య సంఘటనపై జర్నలిస్టులు నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై బైఠాయించి, హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో జర్నలిస్టులు తమ ధర్నాను విరమించారు.

సంబంధిత పోస్ట్