
పలమనేరు: ఎస్ఐపై దురుసు ప్రవర్తన.. మాజీ ఎమ్మెల్యేపై కేసు
పలమనేరు ఎస్ఐ లోకేష్‌పై దురుసుగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టా ఉన్న స్థలంలో మంగళవారం నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పాటు కూల్చడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యేపై బాధితుడు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐని దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. వైకాపా నేత ముజామిల్ కూడా విలేకరులపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదైంది.


































