
వడ్డే ఓభన్న వర్ధంతి: చిత్తూరులో యువ నాయకుడు పవన్ కళ్యాణ్ ఘన నివాళి
స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓభన్న వర్ధంతి సందర్భంగా చిత్తూరులో వడ్డెర యువ నాయకుడు డాక్టర్.యం.డి.హెచ్.పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 1845లో సైరా నరసింహారెడ్డి మరియు వడ్డే ఓభన్న చేసిన వీరోచిత సేవలను పవన్ గుర్తు చేసుకున్నారు. వడ్డే ఓబన్నను స్ఫూర్తిగా తీసుకుని నేటి వడ్డెర యువత మంచి మార్గంలో పయనిస్తూ, వడ్డెరకు చెందాల్సిన హక్కులను, అధికారాన్ని ఐక్యమత్యంతో పోరాడి తెచ్చుకోవాల్సిన బాధ్యతను తెలియజేశారు.


































