Apr 10, 2026, 12:04 IST/
చిన్నారి గొంతులో ఇరుక్కున్న చేప.. తప్పిన ప్రమాదం
Apr 10, 2026, 12:04 IST
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో, ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నెల 3వ తేదీన, కుటుంబ సభ్యులు ఆక్వేరియం శుభ్రం చేస్తుండగా, చేప ఎగిరి చిన్నారి నోట్లోకి దూసుకెళ్లి గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక అల్లాడిపోయిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి, సుమారు మూడు అంగుళాల పొడవున్న చేపను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.