ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం: వైద్యాధికారిణికి సన్మానం

317చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం: వైద్యాధికారిణికి సన్మానం
అన్నమయ్య జిల్లా, పీలేరు ఏరియా హాస్పిటల్ లో ద్వితీయ వైద్యధికారిణి సాయిశ్రీ సోమవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని సదుపాయాలు, నాణ్యతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్నారు. రిటైర్డ్ తహసీల్దార్ తండ్రి, వ్యవసాయ అధికారి భర్త ఉన్నప్పటికీ, ఆమె ప్రభుత్వ ఆసుపత్రి వైపు మొగ్గు చూపడం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ సంఘటన ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించింది.

సంబంధిత పోస్ట్