Dec 18, 2025, 17:12 IST/
e-KYCకి తుది గడువు లేదు: పౌరసరఫరాల శాఖ
Dec 18, 2025, 17:12 IST
TG: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అందింది. ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. e-KYC చేసుకోవడం తప్పనిసరి అని, అయితే దీనికి తుది గడువు ఏమీ లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర తెలిపారు. బియ్యం పంపిణీని ఆపేది లేదని క్లారిటీ ఇచ్చారు. కార్డులో పేరు ఉన్నవారు ఒక్కసారైనా రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు, ఐరిష్ ఇవ్వాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.