Apr 14, 2026, 12:04 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: ఉత్తర తెలంగాణపై KCR వ్యూహం!
Apr 14, 2026, 12:04 IST
ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బహిరంగ సభపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలోనే బీఆర్ఎస్ లో చేరనున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ పట్టు కోల్పోగా, కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచేందుకు కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రయత్నిస్తున్నారు.