Feb 05, 2026, 08:02 IST/
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. బిల్లుల చెల్లింపులో మార్పులు
Feb 05, 2026, 08:02 IST
TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు చేసింది. మూడో విడత బిల్లులను వీబీ జీరామ్‌జీ పథకానికి అనుసంధానం చేశారు. జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించి, ఆ వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చెల్లిస్తుండగా, పునాదికి రూ.లక్ష, గోడలకు రూ.లక్ష, స్లాబ్‌కు రూ.1.40 లక్షలు, పని పూర్తయ్యాక రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. మూడో దశలో స్లాబ్ తర్వాత ఉపాధిహామీ కింద రూ.27,630, స్వచ్ఛభారత్ కింద రూ.12 వేలు, పీఎంజీఏవై కింద రూ.21 వేల చొప్పున మొత్తం రూ.60 వేలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.