పూతలపట్టు మండలం, కొత్తకోట చౌటపల్లి హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తున్న కారు, కుక్కను తప్పించబోయే క్రమంలో ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.