పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, వజ్రాలపురం బోయకొండ గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, మాజీ ఎమ్మెల్సీ బి. ఎన్. రాజసింహులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.