రేణిగుంట మండలంలో అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడం తీవ్రంగా ఖండించదగ్గ చర్య అని సీఐటీయూ నాయకులు మంగళవారం పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాధర్నాను భగ్నం చేయడం దుర్మార్గమని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మార్చి 2వ తేదీన నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తరలివెళ్లే క్రమంలో, రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి, సుబ్బారావమ్మతో పాటు సుమారు మూడు వేల మందిని అడ్డుకున్నారు.