పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మంగళవారం 25 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈవో పెంచల కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం, రూ. 2,11,98,696 ఆదాయం లభించింది. నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 870 గ్రాముల వెండి కూడా కానుకగా వచ్చాయి. గో సంరక్షణ హుండీ ద్వారా రూ. 18,241, నిత్య అన్నదాన హుండీ ద్వారా రూ. 2,48,609 ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించినట్లు తెలిపారు.