గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో గన్ పౌడర్ స్వాధీనం

2చూసినవారు
గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో గన్ పౌడర్ స్వాధీనం
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్సై జయశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో గన్ పౌడర్తో పాటు పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్