బంగారుపాళ్యంలో అక్రమ మద్యం స్వాధీనం

8చూసినవారు
బంగారుపాళ్యంలో అక్రమ మద్యం స్వాధీనం
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం తుమ్మకుప్పం గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శ్రీధర్ (34)ను బంగారుపాళ్యం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో రూ. 10 వేలు విలువైన 46 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :