అర్ధగిరి ఆంజనేయస్వామి ఉత్సవాలకు జనసేన నాయకులకు ఆహ్వానం

2చూసినవారు
అర్ధగిరి ఆంజనేయస్వామి ఉత్సవాలకు జనసేన నాయకులకు ఆహ్వానం
తవణంపల్లిలోని అర్ధగిరి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు జనసేన పార్టీ నాయకులను ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు బి. రాధికా ఆహ్వానించారు. పూతలపట్టులో జనసేన నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాధికా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు రఘురాం చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య, మాజీ కాణిపాకం బోర్డు సభ్యుడు పూల ప్రభాకర్, మాజీ కాణిపాకం చైర్మన్ లత రాజ్‌కుమార్, మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్