పోలవరం చెరువులో పాచి: వాహనదారుల ఆందోళన, యువకుల మానవత్వం

5చూసినవారు
పోలవరం గ్రామంలోని రామసముద్రం చెరువులో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఏర్పడిన పాచి కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిన్న ఇద్దరు యువకులు గాయపడి, తిరుపతి ఆసుపత్రికి తరలించబడ్డారు. రెండు రోజుల క్రితం సచివాలయ సిబ్బంది VRO, VRA కూడా ఇక్కడ పడి గాయపడ్డారు. అయితే, పోలవరం సెక్రటరీ దీనిని పట్టించుకోవడం లేదని, రామాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాలు విరిగి, లక్షల రూపాయల ఖర్చు అయినా స్పందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో స్పందించిన పోలవరం గ్రామ యువకులు పాచిని తొలగించి మానవత్వం చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్