ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Top 10 viral news 🔥
ఏపీలో కొత్తగా 20 ILACS కేంద్రాలు
May 30, 2026, 13:05 IST/

ఏపీలో కొత్తగా 20 ILACS కేంద్రాలు

May 30, 2026, 13:05 IST
AP: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 20 కార్మిక సౌకర్య సముదాయాల (ILACS) ఏర్పాటుకు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరు నగరాల్లో ఈ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు లభించగా.. ఇప్పుడు మరో 20 కేంద్రాలు చేరాయి. ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మించనున్నారు. పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వహణ బాధ్యతలను చేపట్టే సంస్థలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.