బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డ్ డంపింగ్ యార్డును తలపిస్తోంది. మామిడి వ్యర్థాలు కుప్పలుగా రోడ్లపై పేరుకుపోయాయి. చైర్మన్ లేకపోవడంతో అధికారుల నిర్వాహక తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్ల లేక కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాలతో రోగాలు వ్యాప్తి చెందే పరిస్థితి నెలకొంది. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.