బుధవారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, ఎస్టీ కాలనీకి చెందినవారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గాయపడినవారు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు.