పూతలపట్టు: వినాయక స్వామి సేవలో కేంద్ర మంత్రి

1635చూసినవారు
పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయక మంత్రి మురుగన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం, దేవస్థానం ఈవో పెంచల కిషోర్ కేంద్ర మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్