చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ తనిఖీ చేశారు. 'సంజీవిని' పథకం ద్వారా ప్రతి రోగికి ప్రత్యేక కార్డు అందించి, వారి వైద్య చరిత్రను నమోదు చేసి, రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందేలా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.