బంగారుపాళ్యం మండలం బలిజపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలేరు గ్రామానికి చెందిన ఆముదాల శ్రీనివాస్ శెట్టి (55) మృతి చెందారు. బలిజపల్లి గ్రామానికి ఎదురుగా వెళ్తుండగా కంటైనర్ వాహనాన్ని ఢీకొని ఈ దుర్ఘటన జరిగినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కంటైనర్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.