యాదమర్రి: రిజర్వ్ ఫారెస్ట్ లో మహిళ అస్తిపంజరం

5చూసినవారు
యాదమర్రి: రిజర్వ్ ఫారెస్ట్ లో మహిళ అస్తిపంజరం
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలంలోని డీకే చెరువు గ్రామ సమీప రిజర్వ్ ఫారెస్ట్ లో బుధవారం ఒక వృద్ధురాలి అస్థిపంజర అవశేషాలను పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మహిళ తమిళనాడుకు చెందిన మునెమ్మ (90)గా గుర్తించారు. ఆమె మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు, ఆమెపై ఇప్పటికే పరదరామి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అడవిలో దారి తప్పి, ఆహారం, నీరు లేక మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్