
యూరియా కోసం రైతుల తోపులాట: అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
బంగారుపాళ్యం మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు వేసే సమయంలో యూరియా కోసం రైతులు ఎగబడటంతో తుంబకుప్పం గ్రామంలో పంపిణీ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిపడా యూరియా రాకపోవడంతో రైతుల మధ్య తోపులాటలు జరిగాయి. వ్యవసాయ అధికారులు 40 శాతం యూరియా మాత్రమే వచ్చిందని, అందరికీ ఇవ్వలేకపోతున్నామని, తర్వాత అందిస్తామని తెలిపారు. రైతులు మాత్రం అధికార పార్టీ నాయకులకు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని ఆరోపించారు.
































