
పూతలపట్టు: 11 స్వర్ణ గ్రామ సచివాలయాలకు యుపిఎస్ పరికరాలు
పూతలపట్టు నియోజకవర్గం, గుడిపాల మండలంలోని 11 స్వర్ణ గ్రామ సచివాలయాలకు మంగళవారం ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్ చౌదరి, ఎంపీడీవో శిరీషతో కలిసి యుపిఎస్ పరికరాలను పంపిణీ చేశారు. విద్యుత్ కొరతతో ప్రజలకు అందించే సేవలకు అంతరాయం రాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పరికరాలను మంజూరు చేసినట్లు ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.







































