చిట్టిలే వారి పల్లెలో ఇరువర్గాల ఘర్షణ కారు దగ్ధం.

10చూసినవారు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ చిప్పిలేవారిపల్లి గ్రామంలో హోంగార్డులు ముని, హరిబాబుల మధ్య గురువారం రాత్రి జరిగిన గొడవలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో హోంగార్డు మునికి చెందిన కారును ప్రత్యర్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై చౌడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్