పుంగనూరు పట్టణంలోని ఆర్ ఆర్ కళ్యాణ మండపం వేదికగా ఆదివారం “బాబు షూరిటీ – మోసం గ్యారంటీ” పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.