చౌడేపల్లె: ఇంట్లో మంటలు

5చూసినవారు
చౌడేపల్లె: ఇంట్లో మంటలు
చౌడేపల్లె మండలం కాగితి గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఇంటి వద్ద పార్కింగ్ చేసిన బైక్ నుంచి మంటలు చెలరేగి, అవి ఇంట్లోకి వ్యాపించాయి. ఇంట్లో ఉన్న శారదమ్మ, ఆమె కుమారుడు ఉదయ్ కుమార్ సకాలంలో బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.