
ముంబైలో కలకలం.. 20 పిల్లలను బందీలుగా చేసుకున్న యూట్యూబర్
ముంబయిలోని పవయీ ప్రాంతంలోగల ఆర్ఏ యాక్టింగ్ స్టూడియోలో గురువారం మధ్యాహ్నం 15 ఏళ్ల లోపు 20 మంది చిన్నారులను స్టూడియో ఉద్యోగి రోహిత్ ఆర్య బంధించిన ఘటన కలకలం రేపింది. ఆడిషన్స్‌కు వచ్చిన పిల్లలను బయటకు వెళ్లకుండా ఆపడంతో, కిటికీల నుంచి సాయం కోసం అరిచిన వారిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చిన్నారులను రక్షించి, నిందితుడు రోహిత్‌ను అరెస్ట్ చేశారు. మానసిక పరిస్థితి సరిగా లేని రోహిత్, తాను కొందరితో మాట్లాడాలని కోరుకున్నట్లు వీడియో విడుదల చేశాడు.




