పుంగనూరు పట్టణంలోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జనవాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినట్లు నియోజకవర్గం చిన్నా రాయల్ తెలిపారు. కొన్ని సమస్యలను జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, కేంద్ర పార్టీ కార్యాలయం దృష్టికి పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోలా సోమశేఖర్ రాయల్, పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.