కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక ప్రదోష పూజలు ఘనంగా

0చూసినవారు
పుంగనూరులోని మినీ బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ప్రదోషం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నందీశ్వరుడికి పసుపు, కుంకుమ, బంధం, విభూది, పాలు, పెరుగుతో అభిషేకం చేసి, స్వామివారిని అలంకరించారు. అనంతరం మహా మంగళహారతులు సమర్పించగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్