పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం

2992చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో శనివారం ఉదయం తుఫాను ప్రభావంతో ఓ మోస్తరు వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండగా, శనివారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చలి పెరిగింది. మారుతున్న వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

ట్యాగ్స్ :